1. చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు
1. chiikatti kaalamu vachchuchundde - krupakaalamu nupayooginchu
1వ చరణం
చీకటి కాలము వచ్చుచుండె - కృపకాలము నుపయోగించు తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా పల్లవి: తలుపులు తెరచి యుండగనే విరిగిన మనస్సుతో సాగెదవా కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు
2వ చరణం
బీడు భూములధికముగా - చూసిన నీవు సాగిరా యేసుని వారికి చూపించు - ప్రేమా వార్తను చాటించు ||తలుపులు||
3వ చరణం
ఎన్నో రాజ్యములీనాడు - దేవుని పనికి మూయబడె తెరచిన తలుపులు యెదురుండున్- ప్రవేశింతురు జ్ఞానులు ||తలుపులు||
4వ చరణం
విశ్వాసుల సహవాసమున - ప్రేమా ఐక్యత గలదు అని చెప్పెడి దినములు - మన మధ్యకు రావలెను ||తలుపులు||
5వ చరణం
రానైయున్న బాధ్యతలు - మనకధికము ప్రియులారా మనకు జయము గలుగుటకై - వినయమున పోరాడెదము ||తలుపులు||
6వ చరణం
మాదు హృదయముల నింపు - నీదు ప్రేమతో మా ప్రభువా హిందూ దేశపు వీధులలో - నాధా నిన్నే చాటెదము ||తలుపులు||