1. ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
1. oo...maanavundda nii gati eemaunoo teliyunaa
1వ చరణం
ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ? ఆహా.... ఆ...ఆ...అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే మహా భయంకరమో - సింహంబుగా నుండు
2వ చరణం
లోకాలు పుట్టి నప్పటి - నుండి మృతులైనా ఏ కులాజుడైన నాటికి - తీర్పులో నిలచును
3వ చరణం
మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను ప్రతివారు నిలచి యుందురు - బ్రతికిన రీతిగనే
4వ చరణం
గ్రంధాలు విప్ప బడగ - గ్రంధాలలో వారి గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును
5వ చరణం
నరులెల్ల క్రియల చొప్పున - మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము - గురియౌను అగ్నికి
6వ చరణం
ఈ నాడు నీవు కూడను - యేసుని విడచినచో ఆనాడు నీవు కూడను - అందుండి యేడ్చెదవు
7వ చరణం
దేవుని జీవ గ్రంధము - దేవుడు తెరచును ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును