ఆధారం నాకు ఆధారం నాకు
aadhaaram naaku aadhaaram naaku
🎵 TG-1886🌐 Telugu
పల్లవి
ఆధారం నాకు ఆధారం నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||
1వ చరణం
భక్తిహీన బంధంలో నేనుండగా శ్రమల సంద్రంలో పడియుండగా (2) ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
2వ చరణం
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా విడువను ఎడబాయనని పలికిన నా దేవా దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా