ఆహా మహాత్మ హా శరణ్యా

aahaa mahaathma haa sharannyaa

🎵 TG-196💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆహా మహాత్మ హా శరణ్యా హా విమోచకా ద్రోహ రహిత చంపె నిను నా దోషమేగదా ||ఆహా మహాత్మ||

1వ చరణం

"వీరలను క్షమించు తండ్రి నేర రేమియున్" కోరి తిటులు నిన్నుఁ జంపు క్రూరజనులకై ||ఆహా మహాత్మ||

2వ చరణం

"నీవు నాతోఁ బరదైనున నేఁడె యుందువు" పావనుండ యిట్లుఁ బలికి పాపిఁ గాచితి ||ఆహా మహాత్మ||

3వ చరణం

"అమ్మా! నీ నుతుఁడ" టంచు మరి యమ్మతోఁ బలికి క్రమ్మర "నీ జనని" యంచుఁ గర్త నుడివితి ||ఆహా మహాత్మ||

4వ చరణం

"నా దేవ దేవ యేమి విడ నాడితి" వనుచు శ్రీదేవ సుత పలికితివి శ్రమ చెప్పశక్యమా ||ఆహా మహాత్మ||

5వ చరణం

"దప్పికొనుచున్నా న" టంచుఁ జెప్పితివి గద యిప్పగిదిని బాధ నొంద నేమి నీకు హా! ||ఆహా మహాత్మ||

6వ చరణం

శ్రమ ప్రమాదములను గొప్ప శబ్ద మెత్తి హా "సమాప్తమైన" దంచుఁ దెలిపి సమసితివి గదా ||ఆహా మహాత్మ||

7వ చరణం

"అప్పగింతుఁ దండ్రి నీకు నాత్మ" నంచును గొప్ప యార్భాటంబు చేసి కూలిపోతివా ||ఆహా మహాత్మ||

Report Error