పల్లవి
ఆనంద మగు ముక్తి యే నా మందిరము జ్ఞాని మానుగఁ జూచు దాని సుందరము ||ఆనంద మగు||
1వ చరణం
పరదేశివలె దేహా వరణమం దుందున్ ధరణి కాననముగా దర్శించు చుందున్ నెరి దుఃఖసుఖములు సరిగా భావింతున్ పరిశుద్ధాత్ముని వేఁ డి పరితృప్తి నుండు ||ఆనంద మగు||
2వ చరణం
బహు శోధనలు నాపైఁ బడి వచ్చునపుడు నహితాంధతమము న న్నడ్డుకొన్నపుడు నిహబాధ లన్నిన న్నెదిరించినపుడు నహహ యేసునివల్ల నమృతుఁడ నెపుడు ||ఆనంద మగు||
3వ చరణం
ముందు నా మనసు దేవుని కప్పగింతు నందరి నస్మత్తు ల్యముగాఁ ప్రేమింతున్ సందేహ రాహిత్య సరణిలో నిల్తుఁ పొందఁ బోయెడి ముక్తి భువి యందె గాంతు ||ఆనంద మగు||