ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
aananda yaatra idi aatmiiya yaatra
పల్లవి
యేసుతో నూతన యెరుషలేము యాత్ర
1వ చరణం
యేసుని రక్తము పాపములనుండి విడిపించును (2) వేయి నోళ్ళతో స్తుతియించినను (2) తీర్చ లేము ఆ ఋణమును (2)
2వ చరణం
రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండ (2) మనకు పరిచర్య చేయుటకొరకై (2) దేవదుతలు మనకుండగా (2)
3వ చరణం
కృతజ్ఞత లేనివారు వేలకొలదిగ కూలినను (2) కృపా వాక్యమునకు సాక్షులమై (2) కృపవెంబడి కృపను పొందెదము (2)
4వ చరణం
ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసనం (2) ఆత్మానంద భరితులమై (2) ఆగమన కాంక్షతో సాగెదం (2)