ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య

aanandamaanandamee ee bhuviloo yeesayya

🎵 TG-2779🌐 Telugu
పల్లవి

ఆనందమానందమే ఈ భువిలో యేసయ్య నీ జననము (2) సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమ ప్రభావము భూమి మీద తనకిష్టులకు సమాధానము కలుగును గాక హల్లెలూయా ||ఆనంద||

1వ చరణం

తన ప్రజలను వారి పాపమునుండి రక్షించుట కొరకై యేసు భువికి దిగి వచ్చెను తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించుటకు దేవుని జ్ఞానమై వచ్చెను ||సర్వోన్నత||

2వ చరణం

మరణ ఛాయలు చీకటిలోను కూర్చున్నవారికి యేసు అరుణోదయమిచ్చెను పాప శాపము నుండి ప్రజలకు విడుదలనిచ్చుటకు క్రీస్తు నర రూపము దాల్చెను

Report Error