ఆరాధించెద నిను మది పొగడెద

aaraadhincheda ninu madi pogadeda

🎵 TG-2583🌐 Telugu
పల్లవి

ఆరాధించెద నిను మది పొగడెద నిరతము నిను స్తుతియించెదను (2) మార్గము నీవే సత్యము నీవే జీవము నీవే నా ప్రభువా (2) ||ఆరాధించెద||

1వ చరణం

విస్తారంబగు వ్యాపకములలో విడచితి నీ సహవాసమును సరిదిద్దితివి నా జీవితము నిను సేవింపగ నేర్పిన ప్రభువా నీ రక్తముతో నను కడిగితివి పరిశుద్దునిగా జేసితివి నీ రక్షణకై స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను పెద్దలు పరిశుద్దులు ఘన దూతలు నీ సన్నిధిలో నిలచిననూ లెక్కింపగజాలని జనమందున నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా

Report Error