ఆశ తీర నా యేసు

aasha theera naa yeesu

🎵 TG-2353🌐 Telugu
పల్లవి

ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను ఆత్మతో సత్యముతో స్తుతించెదను ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము ||ఆశ||

1వ చరణం

దుప్పి నీటికై ఆశపడునట్లుగా దేవుని కొరకై ఆశ పడుచున్నాను దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా (2) దిన దినమాశతో కనిపెట్టుచున్నాను ||ఎంత||

2వ చరణం

లోక ఆశలు లయమైపోవును లోకులెవ్వరు కాపాడలేరు లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం లోబడు వారిని పారమున చేర్చును

Report Error