ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా
aashrayadurgamaa.... naa yeesayyaa
నవజీవన మార్గమునా.. నన్ను నడిపించుమా... ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యమునాపై చూపినావే ఆశ్రయదుర్గమా.... నా యేసయ్యా
లోక మర్యాధలు - మమకారాలు -గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే... (2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెర వేర్చు చుంటినే నీతో చేసిన.. తీర్మానములు స్థిరపరచితివే...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద...(2) అందుకే ఈ స్తుతి,ఘన,మహిమల స్తోత్రాంజలి.....2 "ఆశ్రయ"
నిత్య నివాసినై నీముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించు చున్నది (2) స్తుతి,ఘనమహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా - హల్లేలూయా - హల్లెలూయా.... 2 "ఆశ్రయ"