పల్లవి
ఆత్మా నడుపు స త్యము లోని కిపుడే యాత్మా నడుపు ఆత్మా నీ సాయంబు నధికంబుగా నిచ్చి ఆత్మానందముతో దై వారాధనమున ||ఆత్మా నడుపు||
1వ చరణం
ఘోర కలుషంబుల దూరంబుగాఁ దోలి పారమార్థిక బుద్ధిఁ గోరు నట్టులను ||ఆత్మా నడుపు||
2వ చరణం
అంధత్వంబు వలన మందమైయుండు మా డెందంబు లెల్ల నీ యందు వెలుఁగుటకు ||ఆత్మా నడుపు||
3వ చరణం
నిర్మల హృదయంబు నిరతంబు మా కిచ్చి కూర్మిన్ నీ వరములఁ గూర్చి దీవించి ||ఆత్మా నడుపు||
4వ చరణం
సకల మానవులతో అకలంక శుభవార్తఁ బ్రకటించు బలజ్ఞాన నిక రంబు నిచ్చి ||ఆత్మా నడుపు||
5వ చరణం
దీవించి పంపు మో దైవాత్మా మమ్మును భావజ్ఞాన మొసంగి ప్రభు సేవలోన ||ఆత్మా నడుపు||