ఆవేదన నేనొందను అవమానముతో నే
aaveedana neenondanu avamaanamuthoo nee
🎵 TG-2857🌐 Telugu
పల్లవి
ఆవేదన నేనొందను అవమానముతో నే కృంగను ఆనందమే నా జీవితం (2) నా యేసుని బాహూవులో హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆనందమే ||ఆవేదన||
1వ చరణం
నాకేమి కావలెనో నేనేమి కోరెదనో నా ఊహలకు ఊపిరి పోసి కోరిన ఈవుల నొసగిన ఉన్నతమైన అద్భుతమైన నీ కార్యములు ఆశ్చర్యమే ||హల్లెలూయా||
2వ చరణం
కష్టాల కెరటాల సుడిగుండమందున కలవరమొంది కృంగిన నన్ను కరుణతో పరమున చేర్చి శిఖరముపైన నిలిపిన దేవా కృపలన్నియు కురిపించితివి (2) ||హల్లెలూయా||