అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
abraahaamu issaaku yaakoobunaku deevudavu
🎵 TG-1557🌐 Telugu
పల్లవి
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు (యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – (2) ||అబ్రాహాము||
1వ చరణం
అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి (2) యాకోబును ఇశ్రాయేలని దీవించి ఈ పాపిని నీవు విడువక ప్రేమించి నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా నీ చేతి నీడలో జీవింతునయ్యా జీవాహారము నేనే అని పలికితివి జీవ జలముల ఓరన నను నాటితివి నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి హృదయము నుండి జీవ జలములు పుట్టించి నీ జీవాహారము – నీ జీవజలమును నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును