అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
adee adee aa rooju yeesayya ugrata rooju
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చేరోజు
వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలేరోజు నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు ||అదే||
సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు భూకంపం కలుగే రోజు దిక్కులేక అరిచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్లు మసలే రోజు అబద్ధికులు అరిచేరోజు దొంగలంతా దొరిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు ||అదే||
పిల్ల జాడ తల్లికి లేదు తల్లి జాడ పిల్లకులేదు చెట్టు కొకరై పుట్ట కొకరై అనాధలై అరిచే రోజు ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు ||అదే||
ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నాదో బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ||అదే||