అదిగో అదిగో అదిగో అదిగో రెండవ రాకడ

adigoo adigoo adigoo adigoo renddava raakadda

🎵 TG-1334💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

అది ఉప్పెన లాగ వస్తుందండి రెండవ రాకడ

1వ చరణం

ప్రళయం వలె వచ్చునండి రెండవ రాకడ అది పరిశుద్దుల కొరకేనండి రెండవ రాకడ

2వ చరణం

మంగళ ధ్వనులు మింటగ మ్రోగను రెండవ రాకడ ప్రధాన దూత శబ్దము తోను రెండవ రాకడ

3వ చరణం

మేఘారూడై వచ్చును యేసు రెండవ రాకడ ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

4వ చరణం

శబ్దం విన్నా సోదరులంతా రెండవ రాకడ ఎవరికీ వారే ఎత్తబడుదురు రెండవ రాకడ

5వ చరణం

మిగిలిన వారికి ముప్పతిప్పలు రెండవ రాకడ తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ

6వ చరణం

ఆకాశమందు వింతలు కల్గును రెండవ రాకడ శక్తులు కదలి మింటను రాలును రెండవ రాకడ

7వ చరణం

భరించలేని బాధలు కలుగును రెండవ రాకడ చద్దామన్నా చావే రాదు రెండవ రాకడ

8వ చరణం

సూర్య చంద్రులు చీకటి కలుగును రెండవ రాకడ ఎక్కడ చూచిన అందకారమే రెండవ రాకడ

9వ చరణం

ఇద్దరు తిరగలి విసరుచుండగ రెండవ రాకడ అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ

10వ చరణం

ఇద్దరు పొలములో - పనికి వెళ్ళగా రెండవ రాకడ అందులో ఒకరు ఎత్తబడుదురు రెండవ రాకడ

11వ చరణం

బస్సులో డ్రైవరు ఎగిరి పోవును రెండవ రాకడ బస్సు గుంటలో బోల్తాపడును రెండవ రాకడ

12వ చరణం

శవమును మోసుకుపోవుచుండగా రెండవ రాకడ మధ్యలో శవము లేచిపోవును రెండవ రాకడ

13వ చరణం

బడిలో పిల్లలు చదువుచుండగా రెండవ రాకడ అందులో అందరు ఎత్తబడుదురు రెండవ రాకడ

14వ చరణం

తప్పవు తిప్పలు తక్కిన వారికి రెండవ రాకడ తప్పుకొనుటకు తావే లేదు రెండవ రాకడ

15వ చరణం

నదిలో నీళ్ళు రక్తం అగును రెండవ రాకడ త్రాగాలంటే నీరే దొరకదు రెండవ రాకడ

Report Error