అగ్ని మండించు – నాలో
agni mandinchu – naaloo
🎵 TG-2772🌐 Telugu
పల్లవి
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||
1వ చరణం
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా