ఐక్యతను ఇవ్వవా ప్రభూ

aikyatanu ivvavaa prabhuu

🎵 TG-1263💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

సమైక్యతను మా సహోదరులలో ఉంచవా

1వ చరణం

పెట్టినాడయా సాతాను కలహంబులను చెదరగొట్టి నాడయా విశ్వాసులను గద్దించవా తండ్రి అపవాదిని ఆత్మ బలమును మాకియ్యవా ప్రభు ||ఐక్యత||

2వ చరణం

సడలిన మా చేతులను బలపరచయ్యా కృంగిన మా కాళ్ళను ద్రుడపరచయ్యా తత్తరిల్లు హృదయాలను ధైర్యపరచయ్యా విశ్వాసములో మమ్ము స్థిరపరచయ్యా ||ఐక్యత||

3వ చరణం

ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా యుద్ధములో జయమును మాకు ఇమ్మయ్యా జీవింపజేయుమా నీ ఆత్మ ను ఆత్మల భారము మాకీయవా ప్రభు ||ఐక్యత||

4వ చరణం

కాచినావు సంఘమును నీ దయ వలెనే నింపినావు బండపై నీ కృప వలెనే చిరకాలం ఐక్యతనే బంధకములతో, సిద్ధ పరచయ్యా నీ రాకడ కొరకు ||ఐక్యత||

Report Error