త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా

tritvamai nityatvamuna neekatvamagu deevaa

🎵 AKK-021💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై నిత్యత్వమున||

1వ చరణం

ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను ||త్రిత్వమై నిత్యత్వమున||

2వ చరణం

వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు ||త్రిత్వమై నిత్యత్వమున||

3వ చరణం

ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై నిత్యత్వమున||

4వ చరణం

ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు ||త్రిత్వమై నిత్యత్వమున||

Report Error