పాహిలోక ప్రభో పాహి లోక

paahilooka prabhoo paahi looka

🎵 AKK-029💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాహిలోక ప్రభో పాహి లోక ప్రభో పాహి యని వేఁడు మాం పాహిలోక ప్రభో ||పాహిలోక ప్రభో||

1వ చరణం

నిన్ను స్తుతియించుచు నీవు ప్రభుఁడ వని చెన్నుమీరఁగ నమ్మియున్నాము సత్ర్పభో ||పాహిలోక ప్రభో||

2వ చరణం

నిత్య మా తండ్రి భూలోకం బంతయు నిన్ను భక్తితో నారాధించుచున్నది మా ప్రభో ||పాహిలోక ప్రభో||

3వ చరణం

దేవ లోకాధిపతులు దూతల సమూహము దేవాయని కొల్చుచున్నారు నిన్నుఁ బ్రభో ||పాహిలోక ప్రభో||

4వ చరణం

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా పరలోక సేనాధిపతివైన మా ప్రభో ||పాహిలోక ప్రభో||

5వ చరణం

ఇహలోకం బంతయుఁ బరలోకం బంతయు నీ మహి మహాత్మ్యముతో నున్నవని ప్రభో ||పాహిలోక ప్రభో||

6వ చరణం

కెరూబులను దూతలు సెరూపులను దూతలు తిరముగా నిన్ గొనియాడుచున్నారు మా ప్రభో ||పాహిలోక ప్రభో||

7వ చరణం

నీ దపొస్తలుల మహిమగల సంఘము ప్రోదిగా నిన్నుతించుచున్నది మా ప్రభో ||పాహిలోక ప్రభో||

8వ చరణం

నిత్యము ప్రవక్తల యుత్తమ సంఘము సత్యముగ నిన్నుతించుచున్నది మా ప్రభో ||పాహిలోక ప్రభో||

9వ చరణం

ధీర హత సాక్షుల వీర సైన్య మంతయు సారెకు నిన్నుతించుచున్నది మా ప్రభో ||పాహిలోక ప్రభో||

10వ చరణం

నిత్య మహాత్మ్యముగల తండ్రి వైన నిన్నును నీదు పూజ్యుఁడగు నిజ అద్వితీయ సుతినిన్ ||పాహిలోక ప్రభో||

11వ చరణం

ఆదరణ కర్తయైనట్టి శుద్ధాత్ముని నంతట నుండు సభ యొప్పుకొనునునిన్ బ్రభో ||పాహిలోక ప్రభో||

Report Error