ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ

prabhuvaa ninnaaraadhinpanu jeeritimi yudaya

🎵 AKK-046💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా దేవా నేఁడు శుభకాంతి విరజిమ్మఁగా విభవముగను ప్రభాకరముగను విరియు నీ తేజంబెలర్పఁగ నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా నిన్నారాధింపను||

1వ చరణం

ఇరులుం గమ్మిననుండి యరుణోదయము దనుక నరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదా విరివిగా మా హృదయసీమల నెరసి యుండిన చీఁకటులుఁబో దరిమి శాంతంబైన మనసుల దయఁబ్రసాదింపను భజింతుము ||ప్రభువా నిన్నారాధింపను||

2వ చరణం

అనఘా నీ సాన్నిధ్యమున నుండఁగా మా దుర్శనసుల నరి కట్టుమో దేవా మా దుర్శనసుల శుచి జేయుము వినయ భయ భక్తులుఁద లిర్పగ వినుచు నీ వాక్యోపదేశము లనిశమును ధ్యానింపనాత్మను బనిచి తుదకుఁ బ్రసన్నమగుము ||ప్రభువా నిన్నారాధింపను||

3వ చరణం

పనిపాటలలో మేమీ దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో దేవా నిన్నే ఘన పరచన్నడిపించుము తనువు శ్రమచేబడలినను మా దారి దుర్గమమైన కనంబడ వనటఁజెందక నేది జేసినఁ బ్రభువు కొఱకని చేయ నడుపుము ||ప్రభువా నిన్నారాధింపను||

Report Error