ఆకాశంబు భూమియు అంతట చీకటి

aakaashanbu bhoomiyu antata cheekati

🎵 AKK-052💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఆకాశంబు భూమియు అంతట చీకటి యాయెను ప్రాకెడు చీకటి సమయమున ప్రార్థన చేతుము మా దేవా ||ఆకాశంబు భూమియు||

1వ చరణం

చక్కని చుక్కలు మింటను చక్కగా మమ్మునుజూడగ ప్రక్కకు రావె వేగముగా ప్రభువా గావుము గావుము నీ నీడన్ ||ఆకాశంబు భూమియు||

2వ చరణం

చిన్న చిన్న పక్షులు చిన్న చిన్న పూవులు ఎన్నో ఎన్నో జీవులు నిన్నే గొలిచి నిద్రించున్ ||ఆకాశంబు భూమియు||

3వ చరణం

చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పడకలలో చిన్న కన్నులు మూయంగా చెన్నుగ యేసూగావుమా ||ఆకాశంబు భూమియు||

4వ చరణం

నేలను బోయెడి బండ్లలో నీటను బోయెడి ఓడలలో గాలి విమానంబులలోన కావుము దేవప్రయాణికులన్ ||ఆకాశంబు భూమియు||

5వ చరణం

రాత్రిలో నీదు దూతలు రమ్యంబైన రెక్కలతో చిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ నిద్రించెదము మాదేవా ||ఆకాశంబు భూమియు||

6వ చరణం

తెల్లవారుజామున తెలివొంది మే మందరము మెల్లగలేచి నుతియింపన్ మేల్కొల్పుము నా ప్రియతండ్రి ||ఆకాశంబు భూమియు||

7వ చరణం

జనక తనయా శుద్ధాత్మా జయము మహిమ స్తోత్రములు అనిశము నీకే చెల్లునుగా అనిశము చెల్లును నీ కామెన్ ||ఆకాశంబు భూమియు||

Report Error