ఘన భవ దుపకృతు లను

ghana bhava dupakrutu lanu

🎵 AKK-068💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఘన భవ దుపకృతు లను మాటికి నే వినుతింతును దే నిజసుత యొనరఁగ నాపై ననుక్రోశముఁదగ నునుపవే క్రైస్తవ జన విహిత ||ఘన భవ||

1వ చరణం

ధోరణిగా నా దోసము లెంచకు సారెకు నాశ్రిత జనవరదా పారముఁదప్పిన పాతకు నగు నే నారడివడ నీ కది బిరుదా ||ఘన భవ||

2వ చరణం

జలబుద్బుదముతో సమ మని నాస్థితి తెలియద నీకది దేహధరా ఖలమయ మగు నీ కర్మినిఁబ్రోవను సిలువను బొందిన శ్రేయఃకరా ||ఘన భవ||

3వ చరణం

మందమతిని నా యందు నలక్ష్యము నొందకు దేవ సు నంద నా యందముగా నా డెందము కడుఁదెలి వొందఁగ నీ దయ నందు మా ||ఘన భవ||

Report Error