సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు

sarvadeeshamulaaraa shree yeesee deevundu

🎵 AKK-069💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో గురుస్తోత్రము జేయను రండి ||సర్వదేశములారా శ్రీ||

1వ చరణం

ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని బుట్టించిన భగవంతుండు ||సర్వదేశములారా శ్రీ||

2వ చరణం

మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము ||సర్వదేశములారా శ్రీ||

3వ చరణం

కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి వినయముతోఁజేరండి ||సర్వదేశములారా శ్రీ||

4వ చరణం

ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ సత్యం బనవరతం బుండును నిజమే ||సర్వదేశములారా శ్రీ||

5వ చరణం

శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ అనయము గొలువుడి జనులారా ||సర్వదేశములారా శ్రీ||

Report Error