చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి
cheerikolvundi kreestuni paadamulan jeeri
చేరికొల్వుఁడి క్రీస్తుని పాదములఁ జేరి కొల్వుఁడి చేరి కొల్వుఁడి స్థిరమతితో మీ నోరు నిండ మది కోరికఁ దీరఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
ధీరకలితుఁ డుప కారకుఁ డితఁ డని యారూఢిగ మదిఁ గోరి ప్రియమునఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
జనకుని యుగ్రం బును దా నోరిచి జనులకు మేలు నో సంగి ఘనునిఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
సార చరిత్రో దారుఁడు పాతక ధీరుఁడు శుద్ధా చారుండితఁడని ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
దేవుని కొమరుఁడు ధీవిస్తారుఁడు సేవ కావనుఁడు క్షేమకరుండని ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
యేసుని వారల నీశుఁడు మన్నన జేసి తప్పు క్షమ చేయునుగానఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
మరణము నొందిన నరులను గృపఁ గ్ర మ్మరఁ బ్రతికించిన మహిమోజ్వలునిఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
పలు దయ్యంబులఁ బారఁదరిమి రో గుల రక్షించిన మలినాపహునిఁ ||చేరికొల్వుఁడి క్రీస్తుని||
జను లచ్చెరు వొం దను మూఁగకు నో రును గన్నులు చీఁ కునకిడినాఁ డని ||చేరికొల్వుఁడి క్రీస్తుని||