పల్లవి
సర్వ లోక సం పూజ్యా నమోనమో సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో సర్వ సత్య సారాంశా నమోనమో దేవా గావో ||సర్వ లోక||
1వ చరణం
దీన భక్త మందారా నమోనమో దోష శక్తి సంహారా నమోనమో దేవా యేసావతార నమోనమో దేవా గావో ||సర్వ లోక||
2వ చరణం
దేవలోక ప్రదీపా నమోనమో భావలోక ప్రతాపా నమోనమో పావనాత్మ స్వరూపా నమోనమో దేవా గావో ||సర్వ లోక||
3వ చరణం
వేదవాక్యాదర్శ మీవె నమోనమో వేద జీవమార్గం బీవె నమోనమో వేదవాక్కును నీవే నమోనమో దేవా గావో ||సర్వ లోక||
4వ చరణం
శాపగ్రహివైతివి నాకై నమోనమో ప్రాణత్యాగివైతివి. నాకై నమోనమో ప్రాయశ్చిత్తమైతివి నాకై నమోనమో దేవా గావో ||సర్వ లోక||