వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద

vachchigaabriyeelu palkenu mariya machchakantidenda

🎵 AKK-106💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు జేయునటంచు ||వచ్చిగాబ్రియేలు పల్కెను||

1వ చరణం

భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర తని కిడు మంచును ||వచ్చిగాబ్రియేలు పల్కెను||

2వ చరణం

అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని కిచ్చునంచు ||వచ్చిగాబ్రియేలు పల్కెను||

3వ చరణం

ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ దె ల్పెను దూత మరియతో ||వచ్చిగాబ్రియేలు పల్కెను||

Report Error