పల్లవి
నాయేసు నామ శబ్దము ఎంతో యింపైనది భయాదులెల్ల దీరిచి విశ్రాంతి నిచ్చును.
1వ చరణం
ఆకలిగొన్న యాత్మకు అదే మన్నాయగు ప్రయాసపడ్డవారికి ఫలము నిచ్చును.
2వ చరణం
ఈ ప్రియమైన నామము నిరీక్షణిచ్చును నాదుర్గమైన స్థానము కృపానిలయము.
3వ చరణం
నా యేసు దివ్యనామము సుక్షేమ నిధియౌ నా దిక్కులేని యాత్మకు సమృద్ధినిచ్చును.
4వ చరణం
యేసూ నీవే నాకాపరి నా రక్షకా, రాజా, నా ప్రభువా, నా జీవమా! నా స్తుతి పొందుము.
5వ చరణం
నీ ప్రేమ ప్రకటింతును నా చావు వరకు నీ నామ సంకీర్తనము నన్నాదరించును.