ఈయనా యేసు రక్షకుడు తన దాయమని రక్షింపఁ దలఁచెనా నన్ను నీయనా యేసు రక్షకుఁడు ఆయాసమగు నొక్క మోపు నే మోయలేకుండ నా మూపుపై నుండ శ్రేయఃకరపు సిలువఁజూపి నాకు హాయి నిచ్చెను భార మంత వెడలించి ||ఈయనా యేసు||
దురితాత్ముఁడని త్రోయకుండ నన్నుఁ బరిశుద్ధుఁడా యేసు ప్రభుఁడు కరుణింప ధరణిలో నిది మహాద్భుతము నే మరుతునా యీ ప్రేమ మరణమౌ దాఁక ||ఈయనా యేసు||
ఓపఁగూడని దుష్కృతంబుల్ నేను తేపతేపకుఁ జేసి ద్వేషినై యుండఁ గోప మింతైన రానీక నన్నుఁ గాపురుషుఁ డని తాను ఖండింపఁ డాయె ||ఈయనా యేసు||
మనస్తమో గుణము లెడబాపెన్ నా దినకరోదయ మట్లు దీప్తిమది మించెన్ తన పాదములఁ జాడ లబ్బెన్ సదా వినుతి కెక్కిన వాని విమలాత్మ వెలుఁగు ||ఈయనా యేసు||
హతుఁ డయ్యె నాయేసు నాకై దు ర్గతి తొలఁగి నాకు మో క్షమే గల్గు కొఱకు అతి దయాదీర్ఘశాంతుండే దైవ సుతుఁ డని యెఱిగితి శోధింపఁగాను ||ఈయనా యేసు||
దీవింపఁదగు నతని సిలువ నా జీవాంతమగు దనుక చెలఁగి మోయుచును ఈ వసుంధర జనుల కెల్ల మీరు సేవించుఁ డేసునని చెప్పి చాటుదును ||ఈయనా యేసు||