ఈలాటిదా యేసు ప్రేమ నన్ను

eelaatidaa yeesu preema nannu

🎵 AKK-165💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా ||ఈలాటిదా యేసు||

1వ చరణం

ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర కిందు వచ్చె ||ఈలాటిదా యేసు||

2వ చరణం

పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతిఁజూపించె ||ఈలాటిదా యేసు||

3వ చరణం

నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటిదా యేసు||

4వ చరణం

పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె ||ఈలాటిదా యేసు||

5వ చరణం

నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా యేసు||

6వ చరణం

శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ యేమందు ||ఈలాటిదా యేసు||

Report Error