పాపి కాశ్రయుఁడవు నీవే యేసు

paapi kaashrayundavu neevee yeesu

🎵 AKK-169💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే

1వ చరణం

ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

2వ చరణం

అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

3వ చరణం

చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

4వ చరణం

రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

5వ చరణం

నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

6వ చరణం

శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

7వ చరణం

భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే యేసు నీవే ||పాపి కాశ్రయుఁడవు||

Report Error