యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన

yeesoo nannu preeminchinaavu paapinaina

🎵 AKK-171💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు ||యేసూ నన్ను||

1వ చరణం

నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ నన్ను||

2వ చరణం

తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ నన్ను||

3వ చరణం

మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్ మించఁ బ్రేమించి నావు ఆహా యెంచ శక్యముగాని మంచి నాలోఁ బెంచ నెంచి ప్రేమించినావు ||యేసూ నన్ను||

4వ చరణం

నన్నుఁ బ్రేమింప నీ కున్న కష్టము లన్ని మున్నై తెలిసియుంటివి తెలిసి నన్నుఁ బ్రేమింప నీ కున్న కారణమేమో యన్నా తెలియదు చిత్రము ||యేసూ నన్ను||

5వ చరణం

నా వంటి నరుఁ డొకఁడు నన్నుఁ ప్రేమించిన నావలన ఫలముఁ గోరు ఆహా నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలంబేమి లేక ||యేసూ నన్ను||

Report Error