యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది
yeesunaadhuni siluvapaini veesi shramanbodinchinadi
యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసునాధుని సిలువపైని||
కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసునాధుని సిలువపైని||
మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసునాధుని సిలువపైని||
పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసునాధుని సిలువపైని||
దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే యందను రక్తియే ||యేసునాధుని సిలువపైని||
హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే హృదయదు రేచ్ఛలే ||యేసునాధుని సిలువపైని||
పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ సం దోహమే ||యేసునాధుని సిలువపైని||
దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా ధారుణిఁ గడుతు నా ||యేసునాధుని సిలువపైని||