యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు

yeesunee seevinparandi moosapookandi prabhu

🎵 AKK-294💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసునే సేవింపరండి మోసపోకండి ప్రభు దోసములను బాపు నండి దొడ్డ ప్రభువండి ప్రభు ||యేసునే సేవింపరండి||

1వ చరణం

దేవుఁ డీతఁడే సుమండి దిగులుపడకండి మన చావు నొంది లేచెనండి జీవ మితఁడండి ప్రభు ||యేసునే సేవింపరండి||

2వ చరణం

పాపులను ప్రేమించె నండి ప్రాణ మిడె నండి ప్రభు దాపుఁజేరి వేఁ డ రండి దయామయుఁడండి ప్రభు ||యేసునే సేవింపరండి||

3వ చరణం

నరకబాధ నొందె నండి నరులకొర కండి ప్రభు దురితములను బాపు నండి దుఃఖపడకండి ప్రభు ||యేసునే సేవింపరండి||

Report Error