యేసు విభునిఁ దలఁచి మదిలో

yeesu vibhunin dalanchi madiloo

🎵 AKK-320💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే ||యేసు విభునిఁ||

1వ చరణం

కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ కృపలో క్షేమ మున్నది కానరే ||యేసు విభునిఁ||

2వ చరణం

సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి బొత్తిగా విడ దీయరే ||యేసు విభునిఁ||

3వ చరణం

కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని కర్త యేసుని బోలరే ||యేసు విభునిఁ||

4వ చరణం

బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే ||యేసు విభునిఁ||

5వ చరణం

మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్ ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే ||యేసు విభునిఁ||

6వ చరణం

సద్దులేకను దేవ సేవ ముద్దుతో ఁ గొని యాడరే హద్దు మీరు విమత సాతాన్ సుద్దులను ద్యజియింపరే ||యేసు విభునిఁ||

7వ చరణం

బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును నమ్మి మీరలు సాధులై వర్తింపరే ||యేసు విభునిఁ||

Report Error