యేసు కరుణ యిదియే మా

yeesu karuna yidiyee maa

🎵 AKK-420💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసు కరుణ యిదియే మా శరణు యేసు కరుణ ||యేసు కరుణ||

1వ చరణం

యేసుని కరుణ యిదే మాకు శర ణని యాసతో నమ్మిన యధముల కెల్ల ||యేసు కరుణ||

2వ చరణం

ఎన్నిక సేయక యే పాపి నైనను మన్నించి బ్రోచెడు మా దేవుఁడైన ||యేసు కరుణ||

3వ చరణం

పశ్చాత్తాపము నొందు పాపుల నెల్లను నిశ్చయముగఁ బ్రోవ నిపుణుఁ డై యున్న ||యేసు కరుణ||

4వ చరణం

దిక్కు లేకున్నటి దీన జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు సదయుఁ డైయున్న ||యేసు కరుణ||

Report Error