యెహోవయే నా మహాదేవుఁడని బహుగ

yehoovayee naa mahaadeevundani bahuga

🎵 AKK-464💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యెహోవయే నా మహాదేవుఁడని బహుగ నెఱిఁగి మన నావంతు సహదాసులతో మహి నొకఁడనని సహాయ మిడుటే నీవంతు ||యెహోవయే నా||

1వ చరణం

మితిమిఱిన దు రిత సమూహముల క్షత మొనర్ప మన నావంతు పతితపావనుని క్షతజనములో నను నుతికి కడుగుటె నీవంతు ||యెహోవయే నా||

2వ చరణం

ప్రతిదిన బ్రతుకును మతి నుంచుచు నిను స్తుతి యొనర్చుటే నావంతు క్షితినేఁబడుదు ర్వెతల నుండ శా శ్వతముఁ బ్రోచుటె నీవంతు ||యెహోవయే నా||

3వ చరణం

చంచల మతిఁదొల గించుమంచుఁ బ్రా ర్థించుచుండుటే నావంతు అంచి తాత్మనిఁకఁ బంచి స్ధిరతను బెంచుచుండుటే నీవంతు ||యెహోవయే నా||

4వ చరణం

యేసు సిలువలో నే సంధించి గాసి సహించుట నావంతు భాసురమోక్ష ని వాసమునకు నను దీసుకపోవుటే నీవంతు ||యెహోవయే నా||

5వ చరణం

మేటి వార్త నా బోటి జనాళికి ఁ జాటించుటయే నావంతు చాటిన దానిని గాటముగ మది నాటించుటయే నీవంతు ||యెహోవయే నా||

6వ చరణం

అనుదిన మబలుఁడ నని మదినిం గనుఁ గొని బ్రదుకుటయే నా వంతు ననుఁ బదాబ్జప జ్జనుఁ జేర్చియు బల మును గృప నిచ్చుటే నీవంతు ||యెహోవయే నా||

7వ చరణం

ముదముతోడ నీ తుదిరాక కొఱకు నెదురు చూచుటే నావంతు సదమలాత్మచే హృదయమును సదా పదిలపఱచునటే నీవంతు ||యెహోవయే నా||

Report Error