యేసుని కొరకై యిల జీవించెద

yeesuni korakai yila jeevincheda

🎵 AKK-474💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

యేసుని కొరకై యిల జీవించెద భాసురముగ నే ననుదినము దోసములన్నియు బాపెను మోక్ష ని వాసమున ప్రభు జేర్చునుగా ||యేసుని కొరకై||

1వ చరణం

నాశనకరమగు గుంటలోనుండియు మోసకరంబగు యూబినుండి నాశచే నిలపై కెత్తెను నన్ను పి శాచి పథంబున దొలగించెన్ ||యేసుని కొరకై||

2వ చరణం

పలువిధముల పాపంబును జేసితి వలదని ద్రోసితి వాక్యమును కలుషము బాపెను కరుణను బిలిచెను సిలువలో నన్నాకర్షించెను ||యేసుని కొరకై||

3వ చరణం

అలయక సొలయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములన్ కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు ||యేసుని కొరకై||

4వ చరణం

శోధన బాధలు శ్రమలిల కల్గిన ఆదుకొనును నా ప్రభువనిశం వ్యాధులు లేములు మరణము వచ్చిన నాధుడే నా నిరీక్షణగున్ ||యేసుని కొరకై||

5వ చరణం

బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు గుప్తమై యున్నవి ప్రభునందు అద్భుతముగ ప్రభు వన్నియునొసగి దిద్దును నా బ్రతుకంటిని ||యేసుని కొరకై||

6వ చరణం

అర్పించెను దన ప్రాణమునాకై రక్షించెను నా ప్రియ ప్రభువు అర్పింతును నా యావజ్జీవము రక్షకు డేసుని సేవింప ||యేసుని కొరకై||

7వ చరణం

ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే దీర్చునుయిలనా చింతలు అభయముతో స్తుతియింతు ప్రభున్ ||యేసుని కొరకై||

8వ చరణం

యౌవన జనమా యిదియే సమయము యేసుని చాటను రారండి పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపన్ ||యేసుని కొరకై||

Report Error