వారె మంచి క్రైస్తవులు గదా
vaare manchi kraistavulu gadaa
పల్లవి
వారె మంచి క్రైస్తవులు గదా యీ లోకమందు వారె మంచి క్రైస్తవులు గదా చేరునట్లు చేయుడి. పారమార్థమైన క్రీస్తు సారవాక్య మనుభవించు వారి దారి గోరి జేరి భూరిసుఖముఁ బడయునట్టి ||వారె మంచి||
1వ చరణం
కపట వేష భాష లెల్లను తొలంగఁ ద్రోచి విపుల భక్తి నిపుణు లగుచును లపితములు నసత్యములును శపధములును లేక దేవ కృప మనంబులోన వెలిగి యుపరిభాగ మరియునట్టి ||వారె మంచి||
2వ చరణం
నమ్మకంబు సుస్థిరంబుగా మనంబులోన సమ్మతంబు గలిగి మెండుగా క్రమ్ము కొనెడి శ్రమలయందు సొమ్మసిలక ప్రభుని పా దమ్ములందు బుద్ధి నిలిపి నెమ్మది గలవార లెవరో ||వారె మంచి||