ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున చొరకున్న లేదు సుఖ మెచట ||ఏది నా||
కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక ||ఏది నా||
కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ మొందెద వి చార మిఁక నేల ||ఏది నా||
యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా కన్నీళ్లు చింత లెడఁబాపి ||ఏది నా||
ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు ||ఏది నా||
నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని పాడి చని పరమసుఖి నౌదు ||ఏది నా||