చాలును లోక భోగములు చాలును

chaalunu looka bhoogamulu chaalunu

🎵 AKK-481💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

చాలును లోక భోగములు చాలును చాలును మీనమును బట్టు గాలమైయున్న భోగములు ||చాలును లోక||

1వ చరణం

ఎండమావులే నీరనుచు మెండుగఁ బరుగిడు జింక కుప మండనై బలహీను నైతిఁ ||చాలును లోక||

2వ చరణం

బూరుగ పండారగింపఁ గోరి కాచికొని యున్నట్టి కీరసామ్య మైతి నయ్యో ||చాలును లోక||

3వ చరణం

దీపపు దీప్తి నాశించి యూపిరి విడు పురుగు రీతిఁ బాపపు భ్రమచే నట్లయితిఁ ||చాలును లోక||

4వ చరణం

పూలతో ఁటయందుఁ బెరుగు బూరుగ వృక్షంబునై నే మేలునకు మూలముగాన నైతిఁ ||చాలును లోక||

5వ చరణం

చల్లిన వితనము ల్జంపు చౌట భూమి వలె నేఁ గాఁగ సత్యము నిష్ఫలమయ్యొ నకట ||చాలును లోక||

6వ చరణం

మాయ సంత నైతి యేసు నాయక నన్విడక మార్పు జేయుమి నెన రుంచి నాపైఁ ||చాలును లోక||

7వ చరణం

తొల్లి నన్ రప్పించినట్టి చల్లని సువార్త తేజ ముల్లమందు నుండఁ జేయ ||చాలును లోక||

8వ చరణం

మంచు పోల్కె ననుఁ జేయుటకై ముంచుమీ నీ రక్తాంబుధిలోఁ బెంచుమి నీ వాక్సారము చేఁ ||చాలును లోక||

9వ చరణం

చెడ్డ బిడ్డ నయ్య నేను దొడ్డ రక్షకుండ వీవు అడ్డులేక నన్నుఁ బ్రోవు ||చాలును లోక||

Report Error