యేసును చూచుట యెన్నటికో పర
yeesunu choochuta yennatikoo para
యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను ||యేసును చూచుట||
బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో ||యేసును చూచుట||
ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో ||యేసును చూచుట||
కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో యంచితముగ హలె లూయా పాటల నానందించుట యెన్నటికో ||యేసును చూచుట||
శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో ||యేసును చూచుట||
నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగఁ గుదురుట యెన్నటికో ||యేసును చూచుట||
జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో ||యేసును చూచుట||