నిదురఁ బోయినట్టి నీ పాద

niduran booyinatti nee paada

🎵 AKK-494💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నిదురఁ బోయినట్టి నీ పాద సేవకుని సదయుఁడగు తండ్రి చక్కగా దాచు సదమలంబగు లోకమున నీ సదనమందునఁ జేర్చి శుద్ధుల వదల కెప్పుడు వారితో నీ పదయుగంబుల సేవఁగోరుచు ||నిదురఁ బోయినట్టి||

1వ చరణం

ఇతఁడీలోకమందు నీవొసంగిన పని హితమతి నొనరించె యేసుని కృపను సతతమును బాపంబుతోడను జాల యుద్ధ మొనర్చి బ్రదుకును నతిముదంబున నీకు నిరతము నుతు లొనర్చెడు నాశఁబూనుచు ||నిదురఁ బోయినట్టి||

2వ చరణం

సన్నిధిఁ జేరిన సకల వరభక్తుల కన్నీరు దుడుతువు కరుణ మీరంగ నిన్ను నమ్మినవారి నడువడి నీవు తేటగ నెఱింగా వారికి జెన్ను గను దీర్చె దవు న్యాయము సన్నుతింపగ సజ్జనావన ||నిదురఁ బోయినట్టి||

3వ చరణం

మరణ కాలంబున ధరలోఁ క్రీస్తుని సిలువ దిరముగఁ జూచిన నరులందఱు వరదుఁడగు రక్షకుని దయచే జిరపురము నిక్కముగఁ జేరుచు గరము నేర్తురు ప్రేమ నచ్చటఁ దరతరంబులు గడుచుచుండగ ||నిదురఁ బోయినట్టి||

4వ చరణం

పరిశుద్ధుఁడగు దేవ పాదసన్నిధిలోనఁ బరిపూర్ణానందము పాదు కొని యుండు నరక బలములు చెరుపనేరవు పరమ జనకుని సుతుల నెమ్మదిఁ జిరదయాళుఁడు గాచు వారల నిరతమును దన యాత్మ బలమున ||నిదురఁ బోయినట్టి||

5వ చరణం

యేసుబాధుని నమ్మి యిలను విడిచినవారు భాసిల్ల లేతురు ప్రభుశక్తి నిలను భాసురంబగు దేహములు తన దాసు లందఱి కిచ్చి మోక్షని వాసులముగాఁ జేసి వారల యాస దీర్చును మాటఁ దప్పక ||నిదురఁ బోయినట్టి||

Report Error