అంత్య దినమందు దూత బూర

antya dinamandu doota boora

🎵 AKK-497💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

అంత్య దినమందు దూత బూర నూదు చుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్ ||అంత్య దినమందు||

1వ చరణం

క్రీస్తునందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయంబునన్ భక్తులార కూడిరండి యంచు బిల్చుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్.

2వ చరణం

కాన యేసుసేవ ప్రత్య హంబు చేయుచుండి నే క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్ కృప నొందు వారి పేళ్లు యేసు పిల్చుచుండగా నేను కూడ చేరియుందునచ్చటన్

Report Error