యేసుని చేతులందు యేసుని రొమ్మునన్
yeesuni cheetulandu yeesuni rommunan
పల్లవి
యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందె పరుండెదన్ కీర్తన వింటివా? నా మన మందునుండి పొందు సుఖం బహా! ||యేసుని చేతులందు||
1వ చరణం
యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెడ నింక నాక ఏ దుఃఖ బాధలైన నచ్చోటఁ జేరవు పాపపు భీతిబాధ లంటవు నన్నటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినా లిటన్
2వ చరణం
యేసె నా యాశ్రయంబు నాకై చావొందెఁగా గొల్గోతయందు నుండు నా గురి సర్వదా చీఁకటి దాఁటుదాఁక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్