రవికాంతిని మించినదౌ ఒక దేశము
ravikaantini minchinadau oka deeshamu
పల్లవి
రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి యాశ్రయ మిచ్చునటన్ ||రవికాంతిని మించినదౌ||
1వ చరణం
దుఃఖబాధలు లేక సదా పూర్ణశాంతినిఁ బొందుచును పరిశుద్ధుల కీర్తనలు అందు నెప్పుడు బాడుదుము.
2వ చరణం
ప్రేమ సాగరుఃడౌ జనకున్ మాకు నిచ్చిన మేలులకై మా కృతజ్ఞత జూపుచును నిత్యమున్ స్తుతి యించెదము