సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి

sadbhaktitooda saakshulai nitya vishraanti

🎵 AKK-500💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

సద్భక్తితోడ సాక్షులై నిత్య విశ్రాంతి నొందు వారిఁ జూడఁగా శ్రీ యేసు నామమున్ స్తుతింతుము హల్లెలూయా! జేయు

1వ చరణం

పోరాటమందు వారి దుర్గమౌ శ్రీ యేసు సంరక్షించు శైలము అంధత్వ మందు జీవకాంతియు హల్లెలూయా!

2వ చరణం

ఓ యోధులారా! ధైర్యశాలురై పూర్వులఁ బోలి యుద్ధ మాడుఁడీ జీవ కిరీటంబు మీ కబ్బును హల్లెలూయా!

3వ చరణం

ఓ దివ్యసభ! స్నేహభావులు! అన్యోన్య సహవాసమున్ నమ్మిక గల క్రీస్తువారలు! హల్లెలూయా!

4వ చరణం

మోక్షంబుఁ జేరి భక్తు లెల్లరు పితృ పుత్ర శుద్ధాత్మలన్ సదా విజయ గీతితో ఁ గీర్తింతురు హల్లెలూయా!

Report Error