విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ

vindu paramandunbendli vindu paramandun

🎵 AKK-508💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు ||విందు పరమందుఁబెండ్లి||

1వ చరణం

సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు ||విందు పరమందుఁబెండ్లి||

2వ చరణం

నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు ||విందు పరమందుఁబెండ్లి||

3వ చరణం

ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు ||విందు పరమందుఁబెండ్లి||

4వ చరణం

పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు ||విందు పరమందుఁబెండ్లి||

5వ చరణం

నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు ||విందు పరమందుఁబెండ్లి||

6వ చరణం

దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు ||విందు పరమందుఁబెండ్లి||

Report Error