శృంగార దేశము చేరఁగానే నా

shrungaara deeshamu cheerangaanee naa

🎵 AKK-513💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

శృంగార దేశము చేరఁగానే నా దుఃఖ బాధలన్నియుఁ బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||శృంగార దేశము||

1వ చరణం

అమితమైన కృపవలన నన్ను స్వర్గంబునఁ జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును.

2వ చరణం

నేను ప్రేమించు స్నేహితులును అక్కడఁ జూచి సంతోషింతును నాయేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము.

3వ చరణం

ఆ స్వర్గ సౌఖ్య మొందువరకు కండ్లతోఁ జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతోఁ జూచి సంతోషింతును

Report Error