దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ

daaniyeelvale saahasinchudi yontarigaa nilva

🎵 AKK-525💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దానియేల్వలె సాహసించుడి యొంటరిగా నిల్వ దానియేల్వలె సాహసించుడి దానియేల్వలె సాహసించుచు జ్ఞానులై దృఢ కార్యముఁ గలిగి దీనులై యా దృఢ కార్యం బిఁకఁ బూని తెల్పను సాహసించుడి ||దానియేల్వలె సాహసించుడి||

1వ చరణం

నిక్కమగు కార్యమునందు నిలిచి దైవాజ్ఞ లెలఁ గ్రక్కున గైకొను జనములగాంచి చక్కఁగ వారిని ఘనపర్చుచు సంతతము నెనరుఁ పించుచు మిక్కిలి దానియేల్సంఘమును మెచ్చుచు నంగీకరించుఁడీ ||దానియేల్వలె సాహసించుడి||

2వ చరణం

ధారుణిపైని నగరములలో మరణించిరిగా కడు శూరులనఁబడువా రనేకులు వారు దానియేల్సంఘమును గని కోరి యేకీభవించినమది వారలే ప్రభుదేవుని భట పరి వారమునఁబడి యుందురు నిజ మిఁక ||దానియేల్వలె సాహసించుడి||

3వ చరణం

కాన నీ సువిశేషమును జెండ పైకెత్తుఁడీ సై తానుని నెదిరించను రండి దీనిని దీని శ్రేణులను యు ద్ధానికి రారమ్మని పిలిచి దానియేల్సంఘము పక్షమునఁ బూని జయధ్వనులనుఁ జేయుటకై ||దానియేల్వలె సాహసించుడి||

Report Error