దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె

deevakaavavee raatri mammulan neeve

🎵 AKK-540💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము ||దేవకావవే రాత్రి||

1వ చరణం

ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ జేయుమీ ||దేవకావవే రాత్రి||

2వ చరణం

పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవకావవే రాత్రి||

3వ చరణం

దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభో ||దేవకావవే రాత్రి||

Report Error